– కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జెల్లా యాకయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని కాచికల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఈడపాక రమేష్ ను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జిల్లా యాకయ్య తెలిపాడు. మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ తొర్రూరు మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి తో కలిసి శుక్రవారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కొన్ని ఏళ్ల నుండి కృషి చేస్తున్నందుకు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో చురుకైన వ్యక్తిగా కొనసాగినందుకు అతని గుర్తించి కాచికల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడిగా ఈడపాక రమేష్ నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ.. ఎస్సీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. వారి సమస్యలు పరిష్కరించేంతవరకు నిరంతరం వెంటఉండి కృషి చేస్తానని తెలిపారు. నాకు ఈ పదవి కట్టపెట్టినందుకు పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపాడు. నా నియమకానికి సహకరించిన కాచికల్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టే దేవేందర్ రెడ్డికి, మండల జిల్లా రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలుఅన్నారు. ఈ కార్యక్రమంలో రాజు శ్రీను రమేష్ సంజీవ గాదె అజయ్ తదితరులు పాల్గొన్నారు.