నవతెలంగాణ -పెద్దవూర
మీ పిల్లలను ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని మండల విద్యాధికారి తరి రాములు అన్నారు. శనివారం ప్రాథమిక పాఠశాల పెద్దవూరలో ఏర్పాటుచేసిన పేరెంట్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం అందించే ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారి సహకారం తీసుకుంటామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల శుభ్రత పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బడిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలను తల్లిదండ్రులు ఇంటిదగ్గర చదివించాలన్నారు. ఆ విధంగా విద్యార్థి చదువులో రాణించగలుగుతారన్నారు. అనంతరం నూతనంగా మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన తరిరాములు ను పేరెంట్స్, పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీప్రభ, ఉపాధ్యాయులు నరేందర్ ,రాములు, చంద్రమౌళి, బ్యూలా పేరెంట్స్ నాగయ్య, షబ్బీర్ ,నాగరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.