నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని ఆయా గ్రామాల్లో, పాఠశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, విద్యా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే ప్రధాన వీధిలో కూడా ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, ఎంపిటిసిలు, ఉప సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, ఎస్ఎంసి చైర్మన్లు, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.