జ్ఞానంతో ప్రపంచాన్ని జయించొచ్చు తొలి అడుగులు పాఠశాలోనే.. సర్కారు బడుల్లో సకలం డిజిటల్ క్లాసుల్లో బోధన నాణ్యమైన ఆంగ్ల విద్యాబోధన తొలిమెట్టుతో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఉచితంగా నోటు బుక్స్, టెక్స్ బుక్స్ అందజేత ‘మన ఊరు- మన బడి’తో రూపుదిద్దుకున్న పాఠశాలలు ఉమ్మడి జిల్లాలో 835 పాఠశాలలు ఎంపిక రూ. 190 కోట్ల నిధులు మంజూరు అల్పహారంలో భాగంగా విద్యార్థులకు రాగి జావ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
సర్కారు బడులను కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా తీర్చిది ద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. మౌలిక వసతులు, మెరుగైన విద్యను అందించేందుకు విద్యారంగం లో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమంలో భాగంగా సకల సౌకర్యాల తో పాఠశాలలను తీర్చుదిద్దుతుంది. కార్పొరేట్ విద్య బోధనలను దీటుగా.. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్యను, డిజిటల్ క్లాసులు నిర్వహిస్తూ పేద విద్యర్థుల్లో ఆత్మవిశ్వసాన్ని నింపుతోంది. దీంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల బాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం.
ఉమ్మడి జిల్లాలో మొత్తం రెండు లక్షల 50 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రం గారెడ్డిలో 1,338 ప్రభుత్వ పాఠశాలలో లక్ష 40 వేల మంది విద్యార్థుల ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో 1032 ప్రభుత్వ పాఠశాలలో 90 వేల మంది చదువుతున్నారు. ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది వేల మంది న్యూ జాయినింగ్ అయ్యారు. ఈ ఏడాది మొత్తం టార్గెట్ పది వేలు గా ఉందని విద్యశాఖ అధికారులు తెలుపుతున్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 20 వేలు టార్గెట్ తీసుకున్నారు. ప్రస్తుతం సుమారు 10 వేలు కొత్త అడ్మిషన్లు వచ్చినప్పటికీ.. జూన్ నెల చివరాఖరిలో టార్గెట్ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకురా వడంతో.. ఆంగ్లంలో నాణ్యమైన విద్యాబోదన కోసం టీచర్ల కు తొలిమెట్టు కార్యాక్రమంతో శిక్షణా తరగతులు నిర్వహించి విద్యార్థులకు సులభమైన పద్దతిలో బోధనలు అందించేం దుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ఇందుకు నిదర్శనం రెండేండ్లుగా ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థు సంఖ్య. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి పిల్లలను సర్కారు బడుల్లో చేర్చందుకు చేస్తున్న కృషితో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు
‘మన ఊరు – మన బడి’లో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 835 పాఠశాలలు మొదటి విడతలో ఎంపిక అయ్యాయి. ఇందుకు ప్రభుత్వం రూ. 190 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో 60 పాఠశాలలు పూర్తయ్యాయి. ఈ పాఠశాలలు కార్పొరేట్ తరగతి గదులకు భిన్నంగా సకల సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ క్లాసు రూమ్‌లో రీడింగ్ టేబుల్స్, లైటింగ్స్, ప్యాన్స్, ప్రాంతమైన వెంటిలేషన్‌తో తరగతులు నిర్మించారు.
270 పాఠశాలలో డిజిటల్ తరగతులు
ఉమ్మడి జిల్లాలో 270 పాఠశాలలో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పెరుగుతున్న సాంక్షేతికతను సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం డిజిటల్ క్లాసు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 180 పాఠశాలు, వికారాబాద్ జిల్లాలో 90 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా టెక్స్‌బుక్స్ మాత్రమే అందించేది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ ఏడాది నుంచి టెక్స్‌బుక్స్‌తో పాటు నోట్ బుక్స్ కూడా పంపిణీ చేస్తోంది. నాణ్యమైన విద్యతో పాటు.. నాణ్యమైన యూనిఫామ్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి.
కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేటు విద్యసంస్థలకు దీటుగా తయారయ్యాయి. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా అన్ని సౌర్యాలతో పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. ఆంగ్లంలో మెరుగైన విద్య అందించడంతో ప్రభుత్వం పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
– సుసిందర్‌రావు, రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి
విద్యార్థులకు డిజిటల్ తరగతులు
పెరుగుతున్న సాంకేతికతను సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు కూడా అందిపుచ్చకోవాలని ప్రభు త్వం డిజిటల్ క్లాసుల నిర్వాహణకు కృషి చేస్తుందన్నారు. ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాలో 80 పాఠశాలలో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నాం. పిల్లల పౌష్టికాహారం అందిం చేందుకు మధ్యాహ్నాభోజనంతో పాటు ఉదయం పూట జావ కూడా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
– రేణుకదేవి, వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిణి