23,24 తేదీల్లో విద్యావైజ్ఞానిక శిక్షణా తరగతులు : డీవైఎఫ్‌ఐ

నవతెలంగాణ – ఎర్రుపాలెం
డీవైఎఫ్‌ఐ జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఈ నెల 23, 24 తేదీలలో ఖమ్మం మంచికంటి ఫంక్షన్‌ హాల్‌లో జరగనున్నాయని, క్లాసుల ప్రారంభ సందర్భంగా 23వ తేదీ ఉదయం మణిపూర్‌ మారణ కాండ- దేశ రాజకీయం ముఖ చిత్రం అనే అంశం పైన సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్‌ తెలిపారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రామిశెట్టి పుల్లయ్య భవనం వద్ద డివైఎఫ్‌ఐ ఎర్రుపాలెం మండల అధ్యక్షులు దివ్వెల వీరాంజనేయులు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకు ఉదయం జరిగే సెమినార్‌కు ప్రధాన వక్తగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, బిగ్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ పీవీ శ్రీనివాసరావు వక్తలుగా హాజరవుతున్నట్లు తెలిపారు. వీరితో పాటు డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్‌, రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, యుసిఎస్‌ఓ వ్యవస్థాపక అధ్యక్షులు గుడిబండ్ల దీపక్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కన్వీనర్‌ పఠాన్‌ రోషిని ఖాన్‌, మద్దాల ప్రభాకర్‌ హాజరవుతున్నారు. ఈ సెమినార్‌ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల అధ్యక్ష కార్యదర్శులు దివ్వెల వీరాంజనేయులు, రామిశెట్టి సురేష్‌, సామినేని మహేష్‌, జువ్వ హుస్సేన్‌ రావు, కొండేపాటి నరేంద్ర, దేవరకొండ రామకృష్ణ, జవాజీ నరేష్‌, మాధవ, వినరు, జింకల తేజ తదితరులు పాల్గొన్నారు.

Spread the love