కొందరు అజీర్తి, మలబద్ధకం, శరీరంలో అసౌకర్యం, కడుపుబ్బరం వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఏమో జరిగిపోతుందనే భయంతో ఆస్పత్రులకు వెళ్తుంటారు. తీరా టెస్టులన్నీ చేశాక ప్రాబ్లం ఏం లేదని డాక్టర్లు చెప్తే అప్పుడు గానీ మనసు ప్రశాంతంగా ఉండదు. కానీ అప్పటికే ప్రాబ్లం ఏంటని తెలుసుకునేందుకు నిర్వహించే టెస్టులకే కనీసం పది పన్నెండు వేలు ఖర్చయిపోయి ఉంటాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఇంట్లోనే పాటించగల కొన్ని హౌమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా జీలకర్ర లేదా జీరా వాటర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అప్పుడప్పుడు తాగడంవల్ల సాధారణ అనారోగ్య సమస్యల నుంచి బయపడే అవకాశం ఉందంటున్నారు చిట్కా వైద్యులు. అయితే దీన్ని ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా జీలకర్రను నీటిలో నాబెట్టడం ద్వారా లేదా మరిగించడం ద్వారా జీరా వాటర్ వస్తుంది. ఈ పానీయాన్ని ప్రతిరోజూ లేదా కనీసం వారంలో రెండు మూడుసార్లు తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. అంటే అజీర్తి, అసౌకర్యం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇక జీరాలోని డైటరీ ఫైబర్ శరీరాన్ని డిటాక్షిఫికేషన్ చేస్తుంది కాబట్టి పేగు కదలికలను ప్రేరేపించడం ద్వారా బలబద్ధకాన్ని నివారిస్తుంది.
జీరా వాటర్‌లో పొటాషియం, కాల్షియం, మాంగనీస్, సెలీనియం వంటి మినరల్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉండటంవల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మంలో మత కణాలు రాకుండా ఉండటంలో, అప్పటికే వచ్చిన వాటిని తొలగించడంలో జీరా వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో వద్ధాప్య ఛాయలు కూడా దూరం అవుతాయని, స్కిన్ అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, దగ్గు, జలుబు, కడుపులో ఉబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.