రైతులపై కాల్పులకు నిరసన దిష్టిబొమ్మలు దహనం

Effigies are burnt in protest against firing on farmersనవతెలంగాణ- విలేకరులు
హర్యానా, పంజాబ్‌ సరిహద్దుల్లో రైతులపై హర్యానా పోలీసులు జరిపిన కాల్పులు, దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రైతు, ప్రజాసంఘాలు, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బ్లాక్‌ డేగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బీజేప ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. హైదరాబాద్‌ నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రగతి నగర్‌ సీఐటీయూ ఆటో స్టాండ్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, హర్యానా సీఎం దాడులకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. షాపూర్‌ నగర్‌ సీఐటీయూ కార్యాలయం దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలో సీఐటీయూ, గిరిజన సంఘాలు బ్లాక్‌ డే నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రైతు కార్మిక సంఘాల నేతలు బ్లాక్‌డే నిర్వహించారు. దేవరకొండలో నల్లబ్యానర్‌తో నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేంద్ర బీజేపీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు యువ రైతు శుభకరన్‌ సింగ్‌ను పంజాబ్‌ బార్డర్‌లో క్రూరంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌లోని సీపీఐ(ఎ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.

Spread the love