నవతెలంగాణ – నుతనకల్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని తోట్ల మాల్సూర్ స్మారక భవనంలో నిర్వహించిన స్వరాజ్యం వర్ధంతి వేడుకలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ అనంతుల రాఘవులు మండల నాయకులు తోట్ల అచ్చయ్య లింగయ్య కూసు సైదులు గజవెల్లి శ్రీనివాస్ రెడ్డి బాణాల విజయ రెడ్డి కూసు బాలకృష్ణ సామ వెంకట్ రెడ్డి దగ్గుల రామచంద్రు శివారెడ్డి రాంబాబు మున్న నాగమల్లు తదితరులు పాల్గొన్నారు.