ఫాస్టర్ ఫెలోషిప్ అభివృద్ధికి కృషి చేయాలి

నవతెలంగాణ-పెన్ పహాడ్: ఫాస్టర్ ఫెలోషిప్ అభివృద్ధికి కృషి చేయాలని మండల ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు పేరాల రాజారత్నం అన్నారు. మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామములోని ఆలివ్ ప్రేయర్ చర్చిలో శుక్రవారం స్థానిక పాస్టర్ వంపు ఫిలిప్ అధ్యక్షతన మండల పాస్టర్ ఫెలోషిప్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి పాస్టర్ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఫెలోషిప్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గుగులోతు రవి నాయక్, సహాయ కార్యదర్శి కిన్నెర ఇమ్మానియేల్, కోశాధికారి గంటేపంగు ఇమ్మానియేల్, బర్మావత్ రాములు నాయక్, బర్మావత్ సైదానాయక్, బొల్లేద్దు దయాకర్, కొండేటి లాజర్, ఎల్ లాజర్,మీడియా కన్వీనర్ మామిడి క్రిస్టోఫర్, జాన్, మండల పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love