సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా కృషి చేయాలి

– గణపాక సుధాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావు పేట్
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందిన అధికారులు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి గడప సుధాకర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సృజన్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పరిచయం చేసుకొని అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలనలో భాగంగా సంక్షేమ పతకాలను అర్హులందరికీ న్యాయం గా చేరేలా ఉన్నత అధికారులు అందుబాటులో ఉండి సకరించాలని కోరారు. తహసీల్దార్ గారు విద్యార్థులకు, మరియు పెదప్రజలకు నిత్యం వారికీఅందుబాటులో ఉండి సహకరించాలని వారిని కోరారు. మండలంలో రెవెన్యూ పరంగా నిరంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కాసార్ల రాంబాబు,చల్వాయి గ్రామ కమిటీ కార్యదర్శి కందాల వెంకన్న, సీనియర్ నాయకులు చుక్క కొమురయ్య, గజ్జల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love