బీరప్పకు మంత్రి హరీశ్‌రావు సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆరోగ్య తెలంగాణ అనే సీఎం కేసీఆర్ ఆశయం మేరకు పని చేసి, నిమ్స్ ప్రతిష్ట మరింత పెంచేలా కృషి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. నిమ్స్ డైరెక్టర్‌గా నూత నంగా నియామకమైన డాక్టర్ బీరప్ప శనివారం హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. నిమ్స్ దేశంలోనే అత్యు త్తమ సేవలందించే ఆస్పత్రిగా అగ్రస్థానంలో నిలవా లని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు డైరెక్టర్ బీరప్పకు శుభాకాంక్షలు తెలిపా రు. తనకు నిమ్స్ డైరెక్టర్‌గా అవకాశం కల్పించడం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు బీరప్ప కృతజ్ఞతలు తెలిపారు. అన్ని విభాగాల సిబ్బంది సమన్వ యంతో ప్రజలకు మంచి వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటా నని తెలిపారు.