
నవతెలంగాణ – వీర్నపల్లి
కరెంట్ సమస్యల పరిష్కారం కొసం కృషి చేయాలని సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం కోరారు. వీర్నపల్లి మండల సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం అధ్వర్యంలో గురువారం మాజి ప్రజా ప్రతినిధులు సిరిసిల్ల సెస్ కార్యాలయంలో సెస్ ఛైర్మెన్ చిక్కాల రామారావు ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం మాట్లాడుతు మండల కేంద్రంలో సీసి రోడ్డు నిర్మాణ విస్తరణ పనులలో భాగంగా రోడ్డుపై ఉన్న పలు పోల్స్ ను తొలగించి పొల్స్ ను సరి చేయాలి, అలాగే వన్ పల్లి , మద్ది మల్ల సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేసి కరెంట్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సెస్ ఛైర్మెన్ చిక్కాల రామారావు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు అరుణ్ కుమార్, బంజార సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ బోయిని రవి, బిజేపి మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి,నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.