పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ గ్రామ కమిటీలు అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జ్ పాపని సురేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీ ఆదేశానుసారం అక్బరుపేట్ భూంపల్లి మండల రామేశ్వరంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ విద్యార్థి, యువజన,సోషల్ మీడియా కమిటీలు వేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి క్రియాశీలకంగా పని చేసేలా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. తదనంతరం బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జ్ పాపని సురేష్ గౌడ్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి గెలవడం ఖాయమన్నారు.దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి మెదక్ ఎంపీతోనే సాధ్యమన్నారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పూజారి మల్లేశం, కూడవెళ్లి దేవాలయం ఛైర్మెన్ పూజారి చంద్రం ,ఉపసర్పంచ్ రవి,అధ్యక్షుడు గొల్ల యాదగిరి,మాజీ యంపిటీసీ బండారు స్వామి గౌడ్,సీనియర్ నాయకులు డాక్టర్ కృష్ణ, కుమార్, అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవారాజ్, యాదవ్, యువజన నాయకులు ప్రశాంత్ గౌడ్, నర్సింలు, లింగం, సత్యనారాయణ, స్వామి గౌడ్, విద్యార్థి నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు,

Spread the love