మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: ఎమ్మెల్యే

నవతెలంగాణ – పెద్దవంగర

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్బీ తండా, రెడ్డికుంట తండా, చిట్యాల, పెద్దవంగర గ్రామాల్లో పాలకుర్తి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య తో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అతి త్వరలోనే ఆరు గ్యారెంటీ పథకాల్లోని 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూ లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, ఎంపీడీవో వేణుమాధవ్, పంచాయతీరాజ్ ఏఈ దయాకర్, నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, తిరుపతి రెడ్డి, నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, దుంపల కుమారస్వామి, బానోత్ గోపాల్, బానోత్ జగ్గా నాయక్, బానోత్ సీతారాం నాయక్, చిలుక దేవేంద్ర సంజీవరావు, బెడద మంజుల, గద్దల ఉప్పలయ్య, దాసరి శ్రీనివాస్, ఓరుగంటి సతీష్, పన్నీరు వేణు, యాకరాజు, చిలుక సంపత్, ఉప్పలయ్య, స్వామి, చంద్రమౌళి, చెరుకు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love