నవతెలంగాణ-హైదరాబాద్ : విఈ కమర్షియల్ వెహికల్స్ యొక్క వ్యాపార విభాగం, ఐషర్ ట్రక్స్ & బస్సెస్ తమ నూతన 3S (సర్వీస్, స్పేర్స్ మరియు సేల్స్) డీలర్‌షిప్, VVC మోటార్స్‌ను ప్రారంభించింది. వరంగల్ నగరం నడిబొడ్డున 1-ఎకరంలో ఈ సదుపాయం వుంది. ఇక్కడే ప్రత్యేకంగా 2000 చదరపు అడుగుల ప్రదర్శన ప్రాంతం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ పూర్తిగా విడిభాగాలకు సంబంధించిన సమగ్ర జాబితా ప్రదర్శించనున్నారు. వీటితో పాటుగా ఈ డీలర్ షిప్ వద్ద సామర్థ్యం మరియు సేవా ఉత్పాదకతను పెంచే బహుళ- సర్వీస్ బేలు కూడా ఉన్నాయి. ఈ డీలర్‌షిప్ 24×7 మద్దతు మరియు ఫ్యాక్టరీ-శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో వ్యవసాయం, పత్తి, వస్త్ర మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలలో పనిచేస్తున్న స్థానిక మరియు రవాణా రంగంలోని ఐషర్ కస్టమర్‌లకు తగిన సహాయాన్ని అందించడానికి సరైన స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన కనెక్టివిటీ కలిగిన వరంగల్, అనేక విద్యా సంస్థలకు నిలయంగా ఉండటం తో పాటుగా రాబోయే ఐటీ పరిశ్రమ కేంద్రంగా కూడా నిలువనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదుతో దాని కనెక్టివిటీ కారణంగా వస్తు రవాణా మరియు ప్రజా అవసరాలు తీర్చుకునేందుకు చేసే ప్రయాణాల పరంగా వ్యూహాత్మక రవాణా కేంద్రంగా కూడా మారింది. రెండు ప్రధాన జాతీయ రహదారులు- NH163 (హైదరాబాద్‌ను ఛత్తీస్‌గఢ్‌ను కలుపుతుంది) మరియు NH563 (జగిత్యాల్ , వరంగల్ మరియు ఖమ్మంలను కలుపుతుంది) కలిపే భట్టపల్లి ప్రధాన రహదారిలో డీలర్‌షిప్ ఉన్న ప్రదేశం రవాణా రంగం లోని ఐషర్ వినియోగదారులకు సేవలు అందించడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా ఈవీపీ, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆఫ్టర్‌మార్కెట్ రమేష్ రాజగోపాలన్ మాట్లాడుతూ ” తెలంగాణలో మా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న వరంగల్ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు సమర్థవంతమైన రవాణా అవసరం. ఈ డీలర్‌షిప్ హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతంలోని ప్రజా మరియు వాణిజ్య రవాణా డిమాండ్‌లను తీర్చడానికి ఐషర్‌కు శక్తివంతమైన బేస్ లభిస్తుంది. VVC మోటార్స్ యొక్క అత్యాధునిక సెటప్, మా సేవా అనుభవాన్ని బలోపేతం చేయడం మరియు ఐషర్ ట్రక్ మరియు బస్ కస్టమర్‌లకు అత్యుత్తమ అప్ టైం మరియు లాభదాయకతను నిర్ధారించాలనే మా లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది…” అని అన్నారు. VECV యొక్క వ్యాపార విభాగం, ఐషర్ ట్రక్స్ మరియు బస్సెస్. ఇది 4.9-55 టన్ GVW ట్రక్కులు మరియు 12-72-సీట్ల బస్సుల నుండి విశాలమైన ఉత్పత్తి శ్రేణి అందిస్తుంది. ఈ ఉత్పత్తులన్నీ ఐషర్ యొక్క పూర్తి వినూత్నమైన BSVI సొల్యూషన్ – EUTECH6 పై ఉత్పత్తి చేయబడ్డాయి. ఇది అత్యంత విశ్వసనీయమైన ఇంజన్ సాంకేతికతను మరియు అత్యున్నత శ్రేణి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. అధునాతన టెలిమాటిక్స్ సొల్యూషన్- My Eicher మరియు పరిశ్రమలో మొదటి 5.5 T GVW ఎలక్ట్రిక్ ట్రక్, ఐషర్ ప్రో 2055 EVతో 100% కనెక్ట్ చేయబడిన వాహణ శ్రేణిని పరిచయం చేసిన మొదటి సంస్థగా ఐషర్ గర్వపడుతుంది. పరిశ్రమ-మొదటి ఐషర్ అప్‌టైమ్ సెంటర్ ద్వారా ఈ ఉత్పత్తులు సాధ్యమయ్యాయి మరియు ఇ-కామర్స్‌లో మెరుగైన లాజిస్టికల్ సామర్థ్యం, నిర్మాణం మరియు మైనింగ్‌లో అత్యుత్తమ సమయం అలాగే బస్సులలో ప్రయాణీకుల భద్రత వంటి సెగ్మెంట్-నిర్దిష్ట ప్రయోజనాలు సైతం అందిస్తుంది. పరిశ్రమలో హెవీ-డ్యూటీ ట్రక్కుల విస్తృత శ్రేణిని కంపెనీ కలిగి ఉంది.