మహంకాళి దేవి ఆలయ అష్టమ వార్షికోత్సవాము

నవతెలంగాణ మిరుదొడ్డి: మహంకాళి దేవి ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో మహంకాళి దేవి అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు విట్టల రాజ పున్నయ్య శర్మ నేతృత్వంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్నేశ్వర పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, రిత్విక్ వర్ణనము, అఖండ దీపారాధన, నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక మంట పారాధన, ప్రధాన కలశస్థాపన, మహంకాళి అమ్మవారికి పంచామృత అభిషేకం, అభిషేకం ,పుష్పార్చన, అలంకరణ పూజ, మంగళహారతి, మహా ఆశీర్వాచనం, రిత్విక్ సన్మానం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు మంగళారతులతో అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఎలుమల స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి అష్టమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావన కలిగి ఉండి , అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటూ, వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరుకోవడం జరిగింది అన్నారు. వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ శర్మ, రమేష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు , గ్రామ ప్రజలు, భక్తులు, రెడ్డి సంఘం సభ్యులు, మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love