బిఎస్పి పార్టీ అభ్యర్థిగా ఏకంబకర్ ప్రజ్ఞా కుమార్ నామినేషన్ దాఖలు

నవతెలంగాణ- మద్నూర్:

జుక్కల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టెన్సీ లో నామినేషన్ల దాఖల రెండో రోజు ఒక నామినేషన్ వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్  అధికారి మను చౌదరి ఐఏఎస్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎండి ముజీబ్ విలేకరులకు తెలిపారు. ఒక నామినేషన్ దాఖలైన అభ్యర్థి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా ఏకంబెకర్ ప్రజ్ఞకుమార్ తమ నామినేషన్ను అందజేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. బిఎస్పి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో అభ్యర్థి ఏకంబకర్ ప్రజ్ఞా కుమార్తో పాటు ఆ పార్టీ నాయకులు తుకారాం కర్రేవార్ రాములు తదితరులు పాల్గొన్నారు.
Spread the love