పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్య

– ఆశి రెడ్డి పల్లి లో విషాదం..
నవతెలంగాణ – చందుర్తి
ఓ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆశిరెడ్డి పల్లి లో చోటుచేసుకుంది. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఆశిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కని కరపు దేవయ్య (70) లక్ష్మి నర్సవ్వ 65 ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు రవీందర్,చిన్న కొడుకు మల్లేశం ఉన్నారు వీరు ఇద్దరు ఆస్తి పంపకాలు చేసుకొని ఇంటి నిర్మాణాలు చేసుకోగా పెద్ద కొడుకు రవీందర్ ఇంటికి తొవ్వ లేదని తన తల్లి దండ్రుల ఉన్న పాత ఇంటిని కూల్చి వేయాలని తండ్రి దేవయ్య,తల్లి లక్ష్మి నర్సవ్వ పై ఆదివారం ఉదయం దాడి చేసి ఇంట్లో ఉన్న దేవున్ని తమకు ఇవ్వాలని గొడవ చేయడంతో  దేవయ్య,లక్ష్మి నర్సవ్వ మనస్తాపానికి గురై ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దింతో చిన్న కొడుకు మల్లేశం తలుపులు తట్టి చూడగా ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు వెంటాన్నే వేములవాడ ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే వృద్ధులు మృతి చెంది నట్లుగా నిర్దారించారు. ఈ ఘటన పై చిన్న కొడుకు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సిరిసిల్ల అశోక్ కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం సిరిజిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మండలం లో రెండో ఘటన
మండలంలో ఇది రెండో ఘటన అనంత పల్లి గ్రామంలో గత మూడు సంవత్సరాల కిందట ఆస్తి పంపకాల కారణంగా పోలె భూమయ్య,రామవ్వ అనే ఇద్దరు వృద్ధ దంపతులు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మరో వైపుగా ఆ ఘటన మర్చి పోక ముందే ఆశి రెడ్డి పల్లి లో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

Spread the love