మీర్ పేట్ లో దారుణం..

– ఆభరణాల కోసమే హత్య చేసి ఉండొచ్చని అనుమానం..
నవతెలంగాణ – మీర్ పేట్
వృద్ధురాలు తలపై సుత్తెతో దాడి చేసి ఆపై హత్య చేసిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నల్లకుంట చెందిన బరిగెల బొజ్జమ్మ(55) భర్త లక్ష్మయ్యతో కలిసి మీర్ పేట్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలోని ఇండో అమెరికన్ పాఠశాలలో వాచ్ మెన్ పని చేస్తూ నివాసం ఉంటున్నారు. 20సంవత్సరాల క్రితం రెండవ పెళ్ళి చేసుకుందని అప్పటి నుండి తన బంధువులకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం తన భర్త కూడా ఏటో వెళ్లిపోయాడని అతన్ని వెతికినట్లు పక్కన ఉన్న వాళ్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం అక్క కొడుకు వచ్చాడని కూడా బొజ్జమ్మ చెప్పినట్లు అంటున్నారు. సిసి కెమెరాల ప్రకారం ఒక వ్యక్తి వచ్చినట్లు గమనించమని అతను బొజ్జమ్మ అక్క కొడుకుగా గుర్తించామని తెలిపారు. అతనే చేశాడా వేరే ఇంకెవరైన చేశారా.. అనేది బొజ్జమ్మ అక్క కొడుకును అదుపులోకి తీసుకుని విచారిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.  ఎల్బీనగర్ డిసిపి సాయిశ్రీ, వనస్థలిపురం ఏసీపీ బింరెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కిరణ్ తెలిపారు.
Spread the love