పెరిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులుగా దిడ్డి మోహన్ రావు ఎన్నిక

నవతెలంగాణ -తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారక్క సన్నిధిలో మంగళవారం ములుగు జిల్లా పెరిక కుల సంఘం ఎన్నికలు జరిగాయి. పెరిక సంఘ ములుగు జిల్లా అధ్యక్షునిగా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దిండి మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా బండారుపెల్లికి చెందిన పెట్టెం రాజు, ఉపాధ్యక్షులుగా బండారుపల్లికి చెందిన బియ్యాల కుమారస్వామి,   రామన్నగూడెంకు చెందిన ఎగ్గడి కోటయ్య లను ఎన్నికయ్యారు.గౌరవ అధ్యక్షులుగా నూగూరు వెంకటాపురంకు చెందిన పల్నాటి నాగేశ్వర్ రావు ను ఎన్నుకున్నారు.  నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న  ములుగు జిల్లా మొదటి పెరిక కుల అధ్యక్షుడు దిడ్డి మోహన్ రావు మాట్లాడుతూ నాపై నమ్మకంతో పెరిక కుల సంఘం ములుగు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు రాష్ట్ర, జిల్లా కుల సంఘ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
జిల్లాలోని ప్రతి గ్రామంలో పర్యటించి పెరిక కుల గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి, సకల సామాజిక రంగాల్లో పెరిక కులస్తులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేస్తానని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ములుగు పెరిక కులస్థులకు పూర్వ వైబవం తీసుకొస్తానని ఈ ప్రాంత ప్రజల విద్య, వైద్య, ఉపాధి సమస్యల్లో పాలుపంచుకుంటానని అన్నారు. అనంతరం పెరికలు అన్ని రంగాల్లో ఎదగాలని రాష్ట్ర, జిల్లా, పెరికి కుల‌ సంఘం నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు.ఈ కార్యక్రమానికి పెరిక కుల రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు సుంకరి ఆనంద్, తెలంగాణ పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్ధ లింగయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కీత విజయకుమార్,రాష్ట్ర సంఘం న్యాయ విభాగం నాయకులు సాయిని నరేందర్, ములుగు జిల్లా రైతు సేవా సమితి అద్యక్షులు పల్ల బుచ్చయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాం విజయ్ పాల్, బొలుగొట్టు శ్రీనివాస్, అక్కల రవి, పెరిక కోపరేటివ్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకతి విజయ్ కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు సూరం రవీందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి వెంకటేశ్వర్లు, దొడ కృష్ణ, అక్కల రఘునాథ్, బుద్దే వీరన్న, ఎం.పి.టి.సి. లు అల్లి శ్రీనివాస్, ఇండ్ల రాజు, కాటపూర్ మాజీ సర్పంచ్ మేడిశెట్టి నర్సింహాయ్య, నాయకులు సాయిని శ్రీనివాస్, దిడ్డి శరత్ కుమార్, ధర్మపురి శ్రీనివాస్, మేడిశెట్టి రమణయ్య, మేడిశెట్టి పురుషోత్తం, పల్నాటి ముకుందం, దిడ్డి నాగేశ్వర్ రావు, కాసర్ల సాంబయ్య, నలివెల సతీష్, న్యాయవాదులు అర్షం రాంబాబు, ఎగ్గడి సుందర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love