బీసీ ఉద్యోగ సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ-కంటేశ్వర్

బీసీ ఉద్యోగ సంఘం కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్. బీసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులుగ కరిపే రవిందర్, కార్యనిర్వాహక అధ్యక్షులుగ నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చంద్రమోహన్ శుక్రవారం నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బీసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు కరిపే రవిందర్ మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లల్లో రిజర్వేషన్లను వెంటనే కల్పించాలని కోరారు. బీసీ ఉద్యోగులందరిని సంఘటితం చేసి అపరిష్క్రుతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అభినందించారు. ఈ కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు బుస్స ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Spread the love