
మండలంలోని మద్దికుంట, స్కూల్ తాండాలో గురువారం భారతీయ కిసాన్ సంఘ్ గ్రామ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొమ్మిడి లక్ష్మారెడ్డి, కార్యదర్శిగా ఓరగంటి లింబాద్రి, కార్యవర్గ సభ్యులుగా చింత రాజిరెడ్డి, రేకులపల్లి ప్రసాద్ రెడ్డి, మై సి సురేష్, ఎం బాలరాజు, మోషన్ పల్లి బాలయ్య, చెన్న నారాయణ, వడ్ల లింగమా చారి లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆనందరావు, జిల్లా అధ్యక్షులు లొంక వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సాయి రెడ్డి, మండల అధ్యక్షులు కొడగండ్ల శేఖర్, బాలయ్య, డాక్టర్ శివయ్య తదితరులు ఉన్నారు.