– మండలాధ్యక్షుడిగా అక్కరవేణి పోచయ్య
నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలోని అయా గ్రామాల్లోని 35 యువజన సంఘాలు కార్యవర్గ సభ్యులు నూతన ఐక్య కమిటీగా ఏర్పాటు చేసుకున్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సుమారు 35 యువజన సంఘాల కమిటీల కార్యవర్గ సభ్యులు సమావేశమై నూతన మండల ఐక్య కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.మండలాధ్యక్షుడిగా అక్కరవేణీ పోచయ్య,ఉపాధ్యక్షులుగా కొత్త రాజ్ కుమార్, జేరిపోతుల మధు,ఎంబాలి సతీష్,గాజే రాజు,ప్రధాన కార్యధర్శిగా తాళ్లపల్లి నరేశ్,సహయ కార్యధర్శులుగా పులి రమేష్,ఏర్రల రాజు,కొడముంజ మహేందర్,జనుగా రాజు,దయ్యాల నరేష్,కోశాధికారిగా మిట్టపెల్లి చెన్నారెడ్డి, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన మండలాధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శిని కార్యవర్గ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు.