నవతెలంగాణ – కంటేశ్వర్
ఎంసీపీఐ (యూ) రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నర్సంపేట పట్టణంలో 4,5,6 జూన్2023 తేదీలల్లో ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ ప్లీనరీలో43 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా 6 మంది సభ్యులను ఆహ్వానితులుగా ఎన్నుకోవడం జరిగింది.ఈ ఎన్నికలల్లో నిజామాబాద్ జిల్లా నుంచి ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మేత్రి రాజశేఖర్ ని రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. పార్టీ నా పై నమ్మకం ఉంచి రాష్ట్ర కమిటీ ఎన్నుకున్నందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గానికి , రాష్ట్ర కమిటీకి ప్రత్యేక విప్లవ ధన్యవాదాలు తెలియచేస్తూ భవిష్యత్తు లో పార్టీ నిర్మాణనికి పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని అన్నారు.