24 నుంచి పార్లమెంట్‌ 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక

24 నుంచి పార్లమెంట్‌ 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక– ప్రొటెం స్పీకర్‌గా కె.సురేష్‌ లేదా రాధామోహన్‌ సింగ్‌?
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. జూన్‌ 24 నుంచి జులై 3 వరకు ఎనిమిది రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు వెల్లడించాయి. ఇందులో భాగంగా 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేష్‌, బీజేపీ ఎంపీ రాధా మోహన్‌సింగ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Spread the love