జులై 4న భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నిక

నవతెలంగాణ – ఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలను జులై 4న నిర్వహించనున్నారు. ఈమేరకు భారత ఒలింపిక్‌ సంఘం ప్రక్రియను ప్రారంభించింది. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో బోర్డును కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన బోర్డు సభ్యులు, ఛైర్మన్‌ ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.

Spread the love