
డిచ్ పల్లి మండలంలోని యానం పల్లి గ్రామంలో జాతీయ చేవాది నివారణ కార్యక్రమంలో భాగంగా టీవీ ముక్త్ గ్రామపంచాయతీగా యానంపల్లి గ్రామాన్ని ఎన్నుకోవడంతో యానంపల్లి గ్రామంలో శనివారం సర్వే ప్రారంభించారు.ఈ సర్వే లోఎవరైనా జ్వరం ,దగ్గు, తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ ఉన్నట్లయితే వారి తెమడ శాంపుల్స్ తీసుకొని పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి మండల ఆరోగ్య విస్తరణాధికారి వై.శంకర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరితో ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో తెమడ పరీక్షలు చేయించాలని ఆశా కార్యకర్తలు కు సూచించారు.ఇప్పటికే కొన్ని గృహ సందర్శన చేసి వారి యొక్క ఇంటిలోని ఆరోగ్య పరిస్థితులను, వివరాలను సేకరించడం జరిగిందని వివరించారు .దేశ వ్యాప్తంగా టిబి ముక్త్ గ్రామ పంచాయత్ కార్యక్రమం లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీ లలో 19 గ్రామ పంచాయతీలు క్షయ రహిత గ్రామాలుగా ఎంపిక చేశారని, ఈ గ్రామాలలోని డేటా వెరిఫికేషన్ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ బృందం యానంపల్లి, కొట్టాలపల్లి గ్రామపంచాయతీ లను సందర్శించి అక్కడ ఉన్న డేటా ని తనిఖీ చేశారని చెప్పారు. టిబి సాంపిల్స్ సేకరించిన ఇంటి కి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపికైన క్షయ రహిత గ్రామాలు చిన్నయాణం, గాదెపల్లి, మందాపూర్,ముల్లంగి (బి), జోర్పూర్ దేగాం, యస్.బి. తాండ, బాబానగర్, పోచంపల్లి, జల్లపల్లి, కారేగాన్, లింగితాండ, అబ్బపూర్, భిక్నెల్లి, బద్గుణ, నాగేపూర్ రెంజల్, కొట్టాలపల్లి, యానంపల్లి ఉన్నాయి.ఈ కార్యక్రమం లో టిబి కో ఆర్డినేటర్ రవిగౌడ్, టీబీ సూపర్వైజర్ పద్మ, టీబీ ల్యాబ్ సూపర్వైజర్ స్రవంతి , గ్రామపంచాయితీ కార్యదర్శి, ఆరోగ్య కార్యకర్త గంగుబాయి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.