మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై ఎలక్షన్‌ పిటిషన్‌ విచారణ

నవతెలంగాణ-హైదరాబాద్‌
తన ఎన్నికపై సవాల్‌ చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వేసిన మధ్యంతర అభ్యర్థన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన మంత్రి అయ్యారు. ఆ ఎన్నికల అఫిడవిట్‌ సమర్పించాక దానిని తిరిగి తీసుకుని మార్పులు చేర్పులు చేశారనీ, ఇది చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ రాఘవేంద్రరాజు ఎన్నికల ఫిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌ లక్ష్మణ్‌ విచారణ చేపట్టి శ్రీనివాస్‌ గౌడ్‌ లేవనెత్తిన సాంకేతిక అంశాలు చెల్లవని తేల్చారు. ఎన్నికలు జరిగిన 45 రోజుల్లోగా ఎన్నిక చెల్లదని పిటిషన్‌ దాఖలు చేయాలన్న వాదనను సుప్రీంకోర్ట సైతం తోసిపుచ్చిందని గుర్తు చేశారు. రాఘవేంద్రరాజు దాఖలు చేసిన మెయిన్‌ పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేశారు.

Spread the love