నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ తేదీ (నవంబర్ 5) మొదలైన కొన్ని గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో ఓటింగ్ కూడా పూర్తయ్యింది. న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వచ్చేసింది. అక్కడ మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మూడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు మూడు ఓట్లు వచ్చాయి. 2020లో మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపు డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు మొగ్గుచూపారు. ఆ ఎన్నికల్లో ఆయనే విజయం సాధించడం విశేషం.