బీఆర్ఎస్ దీక్షా దివస్‌పై ఎన్నికల స్క్వాడ్‌ అభ్యంతరం

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివస్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్క్వాడ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. గడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని అధికారులు సూచించారు. అయితే దీక్షా దివస్‌ ఎన్నికల కార్యక్రమం కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ భవన్‌ బయట, ఆవరణలో కార్యక్రమాలు చేయొద్దని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు కోరగా.. ఎన్నికల అధికారులు అంగీకరించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సహా ఇతర నేతలు తెలంగాణ భవన్‌లో రక్తదానం చేశారు.

Spread the love