– పలు చోట్ల ఈవీఎంలు మొరయింపు
– వృద్ధులను, వికలాంగులను పోలింగ్ కేంద్రానికి తరలింపు
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని 41 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటును గురువారం వినియోగించుకున్నారు. మండలంలోని మొత్తం 36946 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు, 17188 స్రీలు, 19758 ఉన్నారు. మండలంలోని వెంకటపూర్ గ్రామంలో జిల్లా జెడ్పీ చైర్మన్ డి. విఠల్ రావు కుటుంబ సభ్యులతో, మాణిక్ బండారు గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తపల్లి గ్రామంలోని బూత్ నేం 179లో ఇ వియం ఆలస్యంగా ప్రారంభమైంది. సాయిలు అనే యువకున్ని చేతులపై ఎతుక వెళ్లి ఓటు సిబ్బంది వేయించారు. వల్లభ పూర్ గ్రామంలోని 182 బూత్ లో అరగంట ఇవియం మోరయించింది. సంఘటన ను మండల ఎంపీడీఓ మండల ఎన్నిక అధికారిని క్రాంతి సందర్శించారు. ఓటర్లు ఇవియం బయట టెంటు కింద కూర్చుని వేచి చూశారు. ఇవీయం ప్రారంభమైన తరువాత తమ ఓటును వినియోగించారు. మండల వ్యాప్తంగా ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించారు.