– డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
త్వరలో తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1948 ఫార్మసీ చట్టం ప్రకారం ఆరుగురు ఫార్మసిస్టుల ఎన్నుకోవాల్సి ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్ ఉన్నవారే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న వారు వెంటనే రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. రెన్యూవల్ చేసుకునేందుకు జులై 31 చివరి గడువు అని తెలిపారు. ఫార్మసీ కౌన్సిల్ లో చిరునామా, ఈమెయిల్, ఫోన్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కోరారు.