బాలవికాస వాటర్ ప్లాంట్లకు ఎన్నికలు నిర్వహించాలి.. 

– మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన నాయకులు 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ పట్టణంలోని బాలవికాస వాటర్ ప్లాంటు ల కు ఎన్నికలు జరపాలని సోమవారం స్థానిక నాయకులు  మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిసి సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య  హయాంలో ఎన్నికలు జరిగాయని అన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎన్నికలు పెట్టడం లేదన్నారు. ప్రతి యేటా సభ్యుల సమక్షంలో ఆర్థిక  లాభ నష్టాలు చూడాల్సి ఉన్నప్పటికీ అవివే పట్టించుకోవడం లేదన్నారు. పదేళ్లు గడిచిన లెక్కలు, ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. బాలవికాస వాటర్ ప్లాంట్ సంస్థ మున్సిపల్ సంబంధించిన భూములు, భవనాలలో ఎటువంటి పన్నులు చెల్లించకుండా వాడుకుంటున్నారన్నారు. ఇటీవల కొన్ని వాటర్ ప్లాంట్ లు లాభాలలో ఉన్న బంధు చేశారని , పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ఎందుకు మూసివేశారో ప్రజలకు చెప్పాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, వరియోగుల అనంత స్వామి, వెళ్దండి సంతోష్, గాదాస్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love