– సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేస్తుండగా ఘటన
– కాలిపోయిన చేతిభాగం
– సంగారెడ్డిలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స
నవతెలంగాణ- జోగిపేట
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్ వద్దనున్న 132 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేస్తుండగా ఓ కాంట్రాక్టు కార్మికుడు విద్యుద్ఘాతానికి గురయ్యాడు. దీంతో కుడి చేయి భాగం కాలిపోయింది. ఈ దుర్ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్దనున్న జేఎన్‌టీయూ కళాశాలకు సంబంధించిన సోలార్ కరెంటు కనెక్షన్ అన్నాసాగర్ 132 సబ్‌స్టేషన్ నుంచి ఉన్నది. అయితే కళాశాలలో విద్యుత్ సమస్య ఏర్పడటంతో ఏఈ ఆలీ హుస్సేన్ కళాశాలలో పనిచేస్తున్న కిషన్ అనే కార్మికున్ని తీసుకొని వెళ్లి సబ్‌స్టే షన్‌లో మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు. ఏఈ చెప్పడంతో ఎర్తింగ్ రాడ్‌తో వెల్డింగ్ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుద్ఘాతానికి గురై కిషన్ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని కుడి చేతి భాగం కాలిపో యింది. మరోపక్క చేతిలో ఎర్తింగ్ రాడ్ ఉండటంతో పెను ప్రమాదం తప్పిం దని స్థానికులు చెబుతున్నారు. కాగా అతన్ని వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అంది స్తున్నారు. ట్రాన్స్‌కో ఏఈ, జేఎన్‌టీయూ ఏఈ, ఆపరేటర్లు అక్కడే ఉన్న ప్పటికీ.. ప్రమాదం ఎలా జరిగిందో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.