
మంగళవారం రోజున మోపాల్ మండలంలోని న్యాలకల్ గ్రామ శివారులో విద్యుత్ అధికారులు రైతు పొలంబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా డివిజనల్ ఇంజినీర్ ఆపరేషన్ ఉత్తమ్ జాడే మాట్లాడుతూ.. రైతులు తమ మోటర్లకు 3 కె వి ఏ ఆర్ రేటింగ్ గల కె పా సిటర్ లను పెట్టుకోవాలని సూచించడం జరిగినది. దాని మూలన మోటార్లు కాలిపోకుండ వాటికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ మీద భారము పడకుండా వుంటుందని మరియు ఓల్టేజ్ ప్రొఫైల్ మెరుగవుతుంది అని తెలుపడం జరిగినది. అక్కడ వున్న రైతులతో నాణ్యమైన మరియు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, విద్యుత్ పరంగా ఏమైనా సమస్యలు యున్నచో పర్ష్కరించడానికి ఎల్లవేళలో విద్యుత్ సిబ్బంది సిద్ధంగా వున్నారని మరియు గృహజ్యోతికి సంభందించిన వినియోగం నెలకు 200 యూనిట్ల లోపు ఉన్న వినియోగదారులకు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని “O” బిలుల్లు ఇస్తున్నామని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎ ఈ బాబా శ్రీనివాస్ మరియు విద్యుత్ సిబ్బంది లైన్ ఇన్స్పెక్టర్ జగన్ మోహన్ చారి, లైన్మేన్ ఫకీర, ఛందర్, శ్రీనివాస్, రవి, శివ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.