బస్సుపై ఏనుగు దాడి..

నవతెలంగాణ – విశాఖపట్నం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగు ప్రైవేట్ బస్సుపై సోమవారం దాడి చేసింది. అయితే ఈ సమయంలో బస్సు నుంచి ప్రయాణీకులు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాయ్ ఘడ్ నుంచి పార్వతీపురం వెళ్తున్న ప్రైవేట్ బస్సుపై ఏనుగు దాడి చేసింది. కొమరాడ మండలం అర్థం అంతర్ రాష్ట్ర రహదారిపై ఏనుగు బీభత్సం సృష్టించింది. రోడ్డుపైకి వచ్చిన ఏనుగును గమనించిన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డుపై నిలిపివేశారు. బస్సు నుంచి ప్రయాణీకులు దిగిపోయారు. రోడ్డుపై నిలిచిపోయిన బస్సును ఏనుగు తన తొండంతో దాడి చేసింది. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సును ఏనుగు వెనక్కి నెట్టివేసింది. దీంతో ఈ బస్సులోని ప్రయాణీకులు భయంతో కేకలు వేశారు. రోడ్డు పక్కనే ఉన్న ఓ భవనంపై కూడ ఏనుగు దాడికి దిగింది. ఏనుగు ఈ రోడ్డుపై నానా హంగామా చేయడంతో రోడ్డుపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అదేవిధంగా పంటపొలాలను సైతం దాడి చేసింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు ఈ ఏనుగును బంధించారు.

Spread the love