ఓటు వేసేందుకు అర్హత కార్డులివే

To vote Eligibility cardఅసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా ఆయా గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్‌(సీఈసీ) కల్పించింది, కొత్త ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా ఇస్తున్నారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్‌ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ధారణకు పంపిణీ చేసిన ఓటరు స్లిప్‌లు చూపిస్తే సరిపోదు. ఓటరు గుర్తింపు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈమేరకు ఓటర్లంతా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఆరేండ్లలో నాలుగు సార్లు గెలిచారు..
2004-2010 మధ్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా పలుమార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఆరేండ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి రికార్డు సృష్టించారు.
మీకు తెలుసా… రికార్డు స్థాయిలో ఇండిపెండెంట్లు
1967లో ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 68 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. కాంగ్రెస్‌ 165 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ అంతర్గత విభేదాల వల్ల చాలా మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. 165 మంది సభ్యులున్న కాంగ్రెస్‌ పార్టీలోకి ఇండిపెండెంట్లు, ఇతర పార్టీ సభ్యుల చేరికతో 1971 నాటికి సంఖ్య 230కి చేరింది.

Spread the love