నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారిని మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేటట్లు చల్లంగా చూడాలంటూ ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్నం సమర్పించుకొని బోనం ఎత్తి మంత్రి పోన్నం ప్రభాకర్ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కేడం లింగమూర్తి, మండల అధ్యక్షుడు బంక చందు, చిత్తారి రవీందర్, కౌన్సిలర్లు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.