ఎల్లారెడ్డి పల్లి కీ ఉత్తమ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డులు-2023.. 

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగానిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి ఉత్తమ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డులు-2023 ను ఆదివారం ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్థన్ సర్పంచ్  జీ నరేష్ కు అందజేశారు. సెప్టెంబరు 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పురస్కరించుకొని 2022 సెప్టెంబరు , 17, 18 తేదీలలో రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.గ్రామనికి అవార్డు రావడం ఎంతో గర్వకారణమని సర్పంచ్ జీ నరేష్ తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గోల్ల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త పులి సాగర్, బిఅర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
Spread the love