ఎల్లుండి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం లేదు

Ellundi Khairatabad no Ganesha darshanనవతెలంగాణ – హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం మహాగణపతి దర్శనానికి అనుమతి లేదని చెప్పింది. శని, ఆదివారం మాత్రమే అనుమతి ఇస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మంగళవారం నిమజ్జనం ఉండటంతో సోమవారం వెల్డింగ్ తదితర పనుల నేపథ్యంలో భక్తులను అనుమతించబోమని తెలిపింది. కాగా మంగళవారం మధ్యాహ్నానికి లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు.

Spread the love