న్యూఢిల్లీ : టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించే స్టార్ లింక్‌కు భారత్‌లో త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉందని సమాచారం. దేశంలో శాటిలైట్ ఆధారిత వాయిస్, డేటా కమ్యూనికేషన్ సేవల ప్రారంభం కోసం స్టార్ లింక్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఆసంస్థ కేంద్రానికి సమర్పించిన డేటా స్టోరేజీ, ట్రాన్స్ఫర్ వంటి అంశాల్లో స్టార్ లింక్ ఇచ్చిన వివరణలకు ప్రభుత్వం సంతృప్తి చెందిందని రిపోర్టులు వస్తున్నాయి. స్టార్ లింక్‌కు ఒకవేళ అనుమతులు మంజూరు అయితే రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలు త్వరలో అందించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు తీవ్ర పోటీ నెలకొననుంది.