
పోతరెడ్డి పేట రామాలయం కమిటీ చైర్మన్ గా ఏలూరి కమలాకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఉమ్మడి దుబ్బాక మండల కేంద్రంలోని (అక్బర్ పేట భూంపల్లి) పోతరెడ్డి పేట గ్రామంలో రామాలయం కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. అనంతరం నూతనంగా రామాలయ కమిటీ చైర్మన్ గా ఏలూరి కమలాకర్ ని ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తదనంతరం కమలాకర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన ఎన్నికపట్ల కృషి చేసిన కమిటీ సభ్యులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండి మురళి గౌడ్, కమిటీ సభ్యులు జీవన్ రెడ్డి, ఎర్రోళ్ల రాజు, మధుగానీ శ్రీకాంత్, యాదగిరి, చింత జగన్ తదితరులు ఉన్నారు.