– మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్, మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రానికి సంబంధించిన అంశాలను జాతీయ మ్యానిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఏఐసీసీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ విభజన చట్టంలో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అంశాలపై చర్చించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శ్రీధర్‌బాబు అధ్యక్షతన మ్యానిఫెస్టో కమిటీ సమావేశమైంది. సమావేశంలో సభ్యులు అల్తాస్ జానయ్య, జనక్ ప్రసాద్, రియజుద్దీన్, వినోద్‌కుమార్, అనంతుల శ్యామ్ మోహన్, కమలాకర్‌రావు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాంతీయ ఎయిర్ పోర్టులు, వరం గల్ ఎయిర్ పోర్ట్ ఆధునీకరణ, సింగరేణి రైల్వే, స్పోర్ట్స్ యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాల యాలు, సైనిక స్కూల్స్, నవోదయ పాఠశాల లను తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.