ఉపాధి హామీ కూలీలకు ఎండలోనే..

నవతెలంగాణ – రెంజల్
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులను కల్పిస్తున్న కూలీలకు సరైన సౌకర్యాలు లేక వేసవిలో ఎండలోని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదిక పైన కూలీలకు సౌకర్యాలు కల్పించాలని క్షేత్ర సహాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండానే పనులను జరిపిస్తుండడం శోచనీయమని కూలీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స కిట్లను క్షేత్ర సహాయకులు తీసుకువచ్చి కూలీలకు అందుబాటులో ఉంచినప్పటికీ టెంట్లు మాత్రం ఇవ్వకపోవడంతో వారు మండుటెండలోని పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రతి గ్రామానికి సరఫరా చేయాలని కూలీలు కోరుతున్నారు.
Spread the love