మండలంలోని 18 గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులపై మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో 16వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఏప్రిల్ 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల పనులను చేసినట్లు అధికారులు వెల్లడించారు. బృందాలతో డిఆర్పీలు ఎస్ఆర్పీలు బిఎస్లు గ్రామాల్లో పనులు తనిఖీ చేశారు. పనుల్లో అవకతవకలను వెల్లడించారు. అడిషనల్ డిఆర్డిఓ ములుగు వెంకటనారాయణ మాట్లాడుతూ గ్రామపంచాయతీలు చేపట్టిన పనుల్లో అవకతవకలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి జరిమానా విధించారు. రూ.66,310 రికవరీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమన వాణి, డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ (డివిఓ) సాంబయ్య, ఏపీవో అనిల్, ఎస్ఆర్పి రమేష్, పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు మెట్లు ఉపాధి హామీ లేబర్ తదితరులు పాల్గొన్నారు.