ఉపాధి హామీ పనులను పారదర్శకంగా చేయాలి..

– 13వ విడత సామాజిక తనిఖీలు పాల్గొన్న డి ఆర్ డి ఓ
– మండల వ్యాప్తంగా 13 కోట్ల తో జరిగిన పనులపై మండల పరిషత్ లో  ఇన్నర్ ఫోరం
– ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే ఎంతటి వారినైనా సహించేది లేదు
నవతెలంగాణ- మునుగోడు:
గ్రామాలలో  చేపట్టే ఉపాధి హామీ పనులను పారదర్శకంగా  చేయాలి అని డిఆర్డిఓ కాలందిని ఉపాధి హామీ సిబ్బందికి , పంచాయతీరాజ్ కార్యదర్శిలకు సూచించారు . మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 13వ విడత సామాజిక తనిఖీ లో ప్రజా వేదిక కి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . 2021 నుండి 2023 వరకు జరిగిన మండల వ్యాప్తంగా 13 కోట్ల తో జరిగిన పనులపై ఇన్నర్ ఫోరం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో అవకతవకలు జరిగినట్లు అయితే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు . ఈ సమావేశంలో పాల్గొన్న వారు ప్రొసీడింగ్ ఆఫీసర్ గా అదనపు డి ఆర్ డి ఓ  నవీన్ కుమార్, వై. ఉపేందర్ రెడ్డి, స్థానిక ఎంపీడీవో ఆర్ భాస్కర్ , ఎంపీఓ కే.సుమలత, ఏపీవో సీనయ్య, ఉపాధి హామీ  సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు సోషల్ ఆడిట్ బృందం పాల్గొన్నారు .
Spread the love