దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

Employment opportunities should be provided to the disabledనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మున్సిపాలిటీ పరిధిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నగేష్ పేర్కొన్నారు. ఈ విషయమై మంగళవారం మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజును ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. కొత్తగా వికలాంగులకు ఎన్. హెచ్.జి గ్రూపులు నిర్మించి వారికి లోన్ ఇచ్చే విధంగా చూడాలని కోరారు. అలాగే స్ట్రీట్ వెండర్ షాపులలో దివ్యాంగులకు 5 శాతం కేటాయించాలని విన్నవించారు. దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు నగేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో దివ్యంగులు పాల్గొన్నారు.
Spread the love