ముగిసిన లక్నో ఇన్నింగ్స్… డిల్లీ టార్గెట్ ఎంతంటే?

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 26 వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 39, డికాక్ 19 రన్స్ చేసి తొలి వికెట్ కు 20 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పడిక్కాల్ 3 రన్స్ ,స్టాయినిస్ 8 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఇక వెస్టిండీస్ ఆటగాడు పూరాన్ డక్ అవుట్ అయ్యాడు. చివర్లో ఆయుష్ బదోని 35 బంతుల్లో 55 పరుగులతో అదరగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు ,ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.

Spread the love