పాక్ పర్యటనకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన..

నవతెలంగాణ – హైదరాబాద్: అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.  17 మంది సభ్యుల గల బలమైన జట్టును పాక్ పర్యటనకు ఎంపిక చేసింది. శ్రీలంక సిరీస్‌కు దూరమైన ఇంగ్లీష్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి రాగా.. ఓపెనింగ్ బ్యాటర్ జాక్ క్రాలే తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ డకెట్, జాక్ క్రాలే, ఒల్లీ పోప్, హ్యారీ బ్రూక్, జోర్డాన్ కాక్స్,  మాథ్యూ పాట్స్, జో రూట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), షోయబ్ బషీర్, జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, బ్రైడన్ కార్స్, జోష్ హల్, గస్ అట్కిన్సన్, ఓలీ స్మిత్, క్రిస్ వోక్స్.

Spread the love