రాంచీ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్…

Ranchi Testనవతెలంగాణ – హైదరాబాద్
భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కీలకమైన నాలుగవ మ్యాచ్ షురూ అయ్యింది. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య భారత్‌కు బౌలింగ్ అప్పగించాడు. ఇక భారత తుది జట్టులో ఒక మార్పు జరిగింది. పేసర్ ఆకాశ్ దీప్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా క్యాప్‌ను ఆకాశ్ దీప్‌కు అందజేశారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో అతడి స్థానంలో ఆకాశ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
తుది జట్లు.. 
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమాన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.

Spread the love